Skip to content

Instantly share code, notes, and snippets.

@veeven
Last active May 10, 2018 15:40
Show Gist options
  • Save veeven/fbe163e0f56aeccdc48b58f878025928 to your computer and use it in GitHub Desktop.
Save veeven/fbe163e0f56aeccdc48b58f878025928 to your computer and use it in GitHub Desktop.
నేను రేపు విజయవాడ వెళ్తున్నాను.
కిరణ్ అమెరికా నుండి ఎప్పుడు వచ్చాడు?
ఇంకో రెండేళ్ళలో వాడి చదువు పూర్తవుతుంది.
కార్లు వాటికవే నడుపుకుంటే మనుషుల్లా పరధ్యానంలోకి వెళ్ళి నడపవు కదా!
నాకు తమిళం రాదు, కానీ కొన్ని మాటలు అర్థమవుతాయి.
ఎండాకాలం అంటే మామిడి పండ్లు, తాటి ముంజెలు.
నీకు ఇష్టమైన సినిమాల పేర్లు చెప్పు.
నీ అభిమాన నటుడు ఎవరు?
నీకు ఏ రంగు అంటే ఇష్టం?
నిన్న లైబ్రరీ నుండి రెండు నవలలు తెచ్చుకున్నాను.
నిన్న రాత్రంతా వర్షం కురుస్తూన ఉంది, మధ్యలో కరెంటు పోయింది. నిద్ర పట్టలేదు.
రాఘవయ్య గారి చిన్నమ్మాయి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది.
ఆహా, ఈ మండే ఎండల్లో చిరుజల్లులు చల్లగాలి. ఒక్కసారిగా వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారిపోయింది!
ఈ పండగ రోజుల్లో రైలు, బస్సు ప్రయాణాల కంటే విమానయానమే చౌకగా ఉన్నట్టుంది.
ఈ రోజుల్లో వార్తలు చూస్తూంటే బ్యాంకులు మోసగాళ్ళకే అప్పులిస్తున్నాయా అనిపిస్తుంది.
మరో పదేళ్ళలో భారతదేశ జనాభా చైనాని దాటిపోతుంది.
మనం రోజూ వాడే ఉత్పత్తులన్నీ మన భాషలోనే ఉండాలనుకోవడం మన హక్కు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మరియు కేరళలు దక్షిణాది రాష్ట్రాలు.
ఆ హోటల్లో ఇడ్లీ, దోశ తప్ప వేరే టిఫిన్లు ఏమీ నాకు నచ్చవు.
బిర్యానీకి, ముత్యాలకి హైదరాబాద్ ఫేమస్.
గాజులు కొనాలంటే హైదరాబాదులో ఛార్మినార్‌కి వెళ్ళాలి.
రమణ అందరినీ తేలికగా నమ్మేస్తాడు.
ఇక కరీంనగర్, వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ కంపెనీలు వస్తాయని ఒక అంచనా.
రెండువేల రూపాయల నోటుకి చిల్లర ఇస్తారా?
జీవితం కార్డులమయం అయిపోయింది. ప్రతీదానికీ ఓ కార్డు.
సినిమాలు, రాజకీయాలు తప్ప జనాలకి మాట్లాడుకోడానికి ఏమీ దొరకవా!
అనురాధ వాళ్ళకి బందరు రోడ్డులో రెండు షాపులు ఉన్నాయి.
వాడికి సినిమాలంటే పిచ్చి.
గురజాడ అప్పారావు గారి రచనల్లో నాకు నచ్చినది కన్యాశుల్కం.
నేను ఏదైనా అనుకుంటే, చేసే తీరతాను.
గౌతమిది చాలా మొండి పట్టుదల, ప్రసాద్ క్షమించమన్నప్పుడు తను కాస్త మెత్తబడాల్సింది.
మా ఇద్దరి పరిచయం చాలా వింతగా జరిగింది.
గోదారి అందాలు లేకుండా వంశీ సినిమాలు ఉండవు.
మావాడు ఇప్పుడిప్పుడే తెలుగు వ్రాయడం నేర్చుకుంటున్నాడు.
ప్రతిపక్ష నాయకులు అధికార పక్షాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.
పోయిన వారం మేము కుంతాల జలపాతం చూడడానికి వెళ్ళాం.
పిల్లికీ ఎలుకకీ స్నేహం ఎలా కుదురుతుంది?
ప్రాజెక్టు పని మీద కాకినాడలో ఉన్నన్నాళ్ళూ మేము సుబ్బయ్య మెస్సులోనే భోంచేసేవాళ్ళం.
సెలవుల్లో పిల్లలు బాగా ఆటలాడి అలిసిపోయేదాకా ఇంటికి రావట్లేదక్కా.
నువ్వు ఇటీవల చదివిన రెండు తెలుగు పుస్తకాల పేర్లు చెప్పు.
మా ఇంట్లో ఎవరూ మాంసాహారం తినరు.
ఏమిటి విశేషం? ఈరోజు కొత్త బట్టలు వేసుకున్నారు!
అద్దం ఎప్పుడూ అబద్ధం చెప్పదు.
మా క్లాసులో రాజేష్ క్రికెట్ చాలా బాగా ఆడతాడు.
కిషోర్ గత మూడేళ్ళలో నాలుగు ఉద్యోగాలు మారాడు.
జిల్లా స్థాయి టెన్నిసు పోటీల్లో ప్రియాంక ప్రథమ స్థానంలో నిలిచింది.
వచ్చే శుక్రవారం మా ఇంట్లో పంక్షన్.
మా పెంపుడు కుక్క చాలా చురుకైంది, ఎవరినీ గేటు దగ్గరికి కూడా రానివ్వదు.
ఉమ ఎప్పుడూ చీమ-ఏనుగు జోకులే చెప్తూంటుంది.
నేను చిన్నప్పుడు చందమామ, బాలజ్యోతి, బాలమిత్ర పత్రికలు చదివేవాడిని.
Sign up for free to join this conversation on GitHub. Already have an account? Sign in to comment