Skip to content

Instantly share code, notes, and snippets.

@samvarankashyap
Created February 18, 2023 19:40
Show Gist options
  • Save samvarankashyap/2cc63ff3690e370ea4dccd6e823016a5 to your computer and use it in GitHub Desktop.
Save samvarankashyap/2cc63ff3690e370ea4dccd6e823016a5 to your computer and use it in GitHub Desktop.
Abhava siva prana prabhava siva
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అడిగింది ఇచ్చేవు
అడగంది ఇచ్చేవు
అడుగులే తడవుగా సులభా శివా
కోర్కెలు తీర్చేవు
కర్మనూ నేర్పేవు
నీ ఆట తెలుసులే నిఖిలా శివా
సులభా శివా వర వరదా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
పాపాలు తుంచేవు
పుణ్యాలు పెంచెవు
నీ నామ స్మరణతో నాదా శివా
పాపపుణ్య ఫలము
పూర్తిగా కడిగేసి మోక్షమ్ము నోసాగేవు
మంత్రా శివా
గిరిజా శివా పుణ్య ఖనిజా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
ఓంకార నాదమే
ఆదిరూపముగా దాల్చి
అన్ని ఎదలా నిండే అండా శివా
ఏ పూజ చేసినా
మా ప్రార్ధనందేవు
అన్ని ఎరుకాల స్వామి నీవే శివా .
ప్రణవా శివా దివ్య ప్రణయా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
దేవ దానవులను
సమముగా జూసిన
శాంత మూర్తివి నీవు సౌమ్యా శివ
ధర్మమే సడలినా
పాపమే పండినా
ప్రళయలయకారివి రుద్రా శివ
రుద్ర శివా వీర భద్రా శివ
ఆనంద లాలిత్య అనఘా శివా
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అజ్ఞ్యాన అంధులై
విహరించే జనులకు
విజ్ఞ్యాన శిఖ నీవు శిఖరా శివా
నీదు స్తుతినీ జేయ
సాధుసాంగత్యమే
లోకైకనాథాముఖ్యా శివా
అమృతా శివా జ్ఞ్యాన గరళా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అన్నియు నీవయీ
అన్నింటా నీవయీ
అన్నపూర్ణా నాథ అమలా శివా
అన్నీలోకల, భారమ్ము మోయగా
సమవర్తి వైనావు సాంబా శివ
నిత్యా శివా అనౌద్ధత్యా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
అభవా శివా ప్రాణ ప్రభావా శివా
ఆనంద లాలిత్య అనఘా శివా
# conclusion
అభవా శివా, ప్రాణ ప్రభవా శివా 
ఆనంద లాలిత్య అనఘా శివా 
అమృతా శివా జ్ఞ్యాన గరళా శివా 
విజ్ఞ్యాన వైశిష్ట్య విభవా శివా 
గిరిజా శివా పుణ్య ఖనిజా శివా 
అనర్ఘ పుణ్య ప్రదాత శివా
ప్రణవా శివా దివ్య ప్రణయా శివా
సదానంద స్వభావ స్వరూప శివ
రుద్రా శివా వీరభద్రా శివ
రుథిర లోచన లయకారి శివా
నిత్యా శివా అనౌద్ధత్య శివా
బ్రహ్మాండ, పిండాండ అండ శివ
అభవా శివా, ప్రాణ ప్రభవా శివా 
ఆనంద లాలిత్య అనఘా శివా 
~ శివార్పణం
Sign up for free to join this conversation on GitHub. Already have an account? Sign in to comment